![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -523 లో..... సాగర్ ఫోన్ లో మాట్లాడుతాడు. నేను, నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని సాగర్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ బిల్డప్ ఇస్తాడు. ఆ విషయం ధీరజ్ క్యాచ్ చేసుకొని అంటే ఏంట్రా మీరే గవర్నమెంట్ ఎంప్లాయిసా నేను కూడా ప్రేమని పోలీస్ చేస్తానని అంటాడు. రేపే వెళ్లి కోచింగ్ లో జాయిన్ చేస్తానని ధీరజ్ అంటాడు. ఏంటండీ మీరు ఏం మాట్లాడరని వేదవతి అనగానే నాకు తెలుసు మీ ప్లాన్ ప్రేమని కోచింగ్ పంపించడానికి ఇదంతా కానీ నేను ఒప్పుకోనని రామరాజు అంటాడు. చూసావా ఆయన ఎందుకు ఒప్పుకుంటాడని సాగర్ వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతాడు.
ప్లీజ్ నాన్న తనకి పోలీస్ అవ్వాలని డ్రీమ్ అని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. అవును మావయ్య ఇంట్లో పోలీస్ ఉంటే మంచిదే కదా అని వల్లి అనగానే అవును ఇంట్లో దొంగలని పట్టుకోవచ్చని వేదవతి అంటుంది. అటుతిరిగి ఇటుతిరిగి ఇక్కడికే వస్తుందని వల్లి అనుకుంటుంది. మావయ్య మీకు ఇష్టం లేకపోతే వద్దని ప్రేమ అనగానే నీ ఇష్టం నేను ఎందుకు వద్దని అంటాను అమ్మ.. మీ వాళ్ళు ఏమైనా అంటారేమోనని ఆలోచిస్తానంతే.. నీకు నచ్చినట్లు చెయ్ అని రామరాజు అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బయటున్నా సాగర్ దగ్గరికి ధీరజ్ వెళ్లి తనని ఎత్తుకొని తిప్పుతూ చాలా థాంక్స్ రా నీకు తెలియకుండానే పెద్ద హెల్ప్ చేసావని ధీరజ్ అంటాడు. నాన్న ప్రేమ పోలీస్ అవ్వడానికి ఒప్పుకున్నాడని ధీరజ్ అనగానే కంగ్రాట్స్ ప్రేమ అని సాగర్ చెప్తాడు. నువ్వు మారిపోయావు అనుకున్న కానీ నువ్వు ప్రేమకి కంగ్రాట్స్ చెప్పావని ధీరజ్ అనగానే నేను మంచివాడినే మీ వల్ల నేను ఇలా అయ్యానని సాగర్ అంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ , వేదవతి, నర్మద నలుగురు కలిసి డ్యాన్స్ చేస్తారు. అదంతా వల్లి చూసి కుళ్ళుకుంటుంది. మరొకవైపు అమూల్యని కొంతమంది కాలేజీలో ఆటపట్టిస్తారు. దాంతో విశ్వ వచ్చి వాళ్ళని కొడతాడు. చాల బాగా యాక్టింగ్ చేస్తున్నావ్.. నా ముందు సింపథీ కొట్టేయడానికి ఇదంతా అని విశ్వని అమూల్య కోప్పడి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత విశ్వ ఫ్రెండ్స్ వచ్చి నువ్వే తనని ఏడిపిస్తావ్.. అలాంటిది ఇలా కొట్టావ్ ఏంట్రా అని అడుగుతారు. అప్పుడు తన విలువ తెలియలేదు.. ఇప్పుడు నేను మారిపోయాను.. తను నా లైఫ్ లో ఉండాలని విశ్వ అంటాడు. మరొకవైపు భాగ్యం వాళ్ళ దగ్గరికి వల్లి వెళ్తుంది. సుకన్యకి తిరుపతి పువ్వు విసురుతాడు. అది వల్లి జడలో పడుతుంది. అది చూసి ఏంటి ఇదంతా అని అడుగుతుంది. అది వేరే ప్లాన్ అని భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ది లవ్ మ్యారేజ్ కాదన్న విషయం చెప్తుంది. అందుకే నేనొక ప్లాన్ చేసాను. మీరు ఫాలో అవ్వండి అని భాగ్యం, సుకన్యలకి వల్లి చెప్తుంది. మరొకవైపు ప్రేమని తీసుకొని ధీరజ్ కోచింగ్ లో జాయిన్ చెయ్యడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |